How to watch youtube without advertisements (adds)?
యూట్యూబ్ వీడియోలు బ్రౌజర్లో చూస్తున్నట్లయితే, url లో youtube.com తరువాత ఒక చుక్క ను చేర్చి ఎంటర్ కీ నొక్కితే మీరు చూస్తున్న వీడియోలో యాడ్స్ రావు.
ఉదాహరణకు
https://www.youtube.com/watch?v=Nf397AP2r-U - ఈ లింక్ లో యాడ్స్ వస్తాయి.
https://www.youtube.com./watch?v=Nf397AP2r-U - ఈ లింక్ లో యాడ్స్ రావు.
అలాగే వీడియో ని చివరి వరకు స్క్రోల్ చేసి, పూర్తయిన తర్వాత రిప్లే బటన్ నొక్కితే మరలా వీడియో ప్లే అయ్యేటప్పుడు యాడ్స్ రావు.
ఈ టెక్నిక్స్ ల్యాప్టాప్ లోనూ, మొబైల్స్ లోను పని చేస్తాయి.
మీరు డెస్క్టాప్ లేదా లాప్టాప్ వాడుతూ ఉంటే, మీరు వాడుతున్న క్రోమ్, ఫైర్ ఫాక్స్ లాంటి బ్రౌజర్స్ లో uBlock
అనే ఎక్స్టెన్షన్ ను వాడితే యూట్యూబ్ తో సహా ఏ వెబ్సైట్ లో కూడా యాడ్స్ రావు.మీరు మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటే, Brave
లేదా వేరే ఏదైనా యాడ్ బ్లాక్ బ్రౌజర్ లో యూట్యూబ్ వాడితే అందులో యాడ్స్ రావు.మీ ఫోన్ ను root చేసి ఉంటే, AdAway
ఆప్ ఇన్స్టాల్ చేసుకుని యూట్యూబ్ ads hosts ఫైలు ను అప్డేట్ చేస్తే, యూట్యూబ్ యాప్ లో యాడ్స్ రావు.Vanced
, NewPipe లాంటి యాప్స్ ఇన్స్టాల్ చేసి వాడుకోవచ్చు. ఇవి అచ్చం యూట్యూబ్ మాదిరే ఉంటాయి. వీటిలో కూడా ఎటువంటి ఆడ్స్ రావు. ఈ యాప్స్ మీ స్మార్ట్ టీవీ లో కూడా పనిచేస్తాయి.ఇవేమీ వద్దనుకుంటే, యూట్యూబ్ ప్రీమియం మెంబర్ షిప్ కొనుగోలు చేయవచ్చు. దీనికి నెలకు 139 రూపాయలు చెల్లించాలి.
Category:
Telugu
Posted on:
April 14th, 2023