Enlightenment
మీరు ఇది గమనించారా.
నిండు పున్నమి రోజు గాని చంద్రుడు పూర్తిస్థాయిలో ప్రకాశిస్తున్నప్పుడు రాత్రివేళ మీరు చాలా నిశ్శబ్ద వాతావరణంలో చూసినట్టయితే ఒక అద్భుతమైన శక్తి భూమ్మీద పరుచుకుంటూ ఉన్నట్టుగా అనిపిస్తుంది.
దీన్ని గమనించాలంటే ముందు మీ మైండ్ పూర్తిగా ఆలోచనలు లేని స్థితికి వెళ్లి ఉండాలి లేకపోతే అది చేసే గందరగోళంలో ఈ అద్భుతాన్ని మీరు గుర్తించక పోవచ్చు.
ఇది ఒక సముద్రం వలె భూమ్మీద పరుచుకుని ఉంటుంది ఈ సమయంలో మనం ధ్యానం చేసినట్టయతే మనకు ఒక బంధం ఏర్పడుతుంది.
జీవన్ముక్త స్థితి లేదా మోక్ష స్థితి అనేది ఒక్కసారిగా ఏర్పడదు అది కొంచెం కొంచెం గా ఆ స్థితికి మనల్ని తీసుకుపోతుంది.
ఎందుకంటే సహస్రారము ఒక్కసారిగా తెరుచుకోవడం అంటూ జరగదు అనేక దశల్లో అది తెరుచుకుంటుంది.
హిందూ ధర్మంలో సహస్రార చక్రాన్ని ఈ విధమైన పుష్పం తో సూచిస్తారు.
ధ్యానం చేసిన వాళ్ళు ముందుగా అందులో మొదటి భాగాన్ని తాకుతారు తర్వాత సాధన ఆపి నట్లయితే మళ్లీ వెనక్కు పడతారు.
ఇలా వెనక్కి ముందుకు పడుతూ చాలా మంది ముందుకు వెళ్ళలేరు..
సహస్రం పూర్తిగా తెరుచుకున్నప్పుడే మోక్ష స్థితి ఏర్పడుతుంది.
దీన్ని ఒక మాతాజీ ఇలా వివరించారు.
నువ్వు ఒక నీటి బొట్టువు, ఈ నీటి బొట్టు వెళ్లి సముద్రంలో కలిసింది అప్పుడు నీటిబొట్టు సముద్రం గా మారిపోయింది.
అంటే ఇక్కడ నేను నేను అనే ఐడెంటిఫికేషన్ ని సాధకులు కోల్పోతారు.
ఇక అందరూ నీలోని భాగమే అనుకుంటావు చెట్లు జంతువులు ఇతర మనుషులు అందరూ….
ఒక యోగి ఆత్మకథ లో పరమహంస యోగానంద కూడా ఈ స్థితిని వాళ్ళ గురువు వల్ల టెంపరరీగా అనుభవిస్తాడు.
Jk బయట కూర్చుని ధ్యానం చేస్తున్నాడు దీని గురించి ఇలా అన్నాడు. కనబడే గడ్డి నేనే , ఆ గడ్డి పైన వాలే క్రీములు నేనే ఆ గడ్డి కట్ చేసే అతను కూడా నేనే.
ఈ స్థితి గురించి ఓషో వివరించినట్టుగా ఎవరు వివరించలేదు. దీనికి సంబంధించిన లింకు ఇచ్చాను అది ఒకసారి చదవండి.
ఇవన్నీ బాలకృష్ణకు ఎలా తెలుసు ?.. ఎందుకంటే తను సహస్రాన్ని కొద్దిగా ఓపెన్ చేశాడు, కింద పడుతూ లేస్తూ ఉంటాడు. కొన్ని స్థితుల్ని అనుభవించాడు.
Category:
Telugu
Posted on:
April 25th, 2023