Flaxseed
అవిసె గింజలతో డైటరీ ఫైబర్స్, ఒమేగా( ఒమేగా-3,ఒమేగా-6) ఫాటీ ఆసిడ్స్, ఐరన్, విటమిన్స్: E, B1, B6 సమృద్ధిగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ గింజలలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియంలు కూడా పుష్కలంగా ఉంటాయి, ఇవి మన ఆహారంలో ఖనిజ లోపాలను పూరించడానికి సహాయపడతాయి.
ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ ఆరోగ్యకరమైన, అవసరమైన కొవ్వు రకానికి చెందినవి ,అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చేప ఒమేగా -3 కు అద్భుతమైన ఆహరం. శాఖాహారులు ఒమేగా -3 ఫాటీ ఆసిడ్స్ యొక్క లోపాన్ని అవిసె గింజలు తినడం వల్ల పూరించవచ్చు.
ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అని పిలువబడే ఒక రకమైన ఒమేగా-3 లో ఎక్కువగా ఉంటుంది, ఇది మెదడు ఆరోగ్యంతో బలంగా ముడిపడి ఉంది. ఈ ఫ్యాటీ యాసిడ్ లోపం వల్ల మెదడు లో వైకల్యాలు ఏర్పడతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ లోపం పొరల నిర్మాణం మరియు పనితీరును మారుస్తుంది మరియు చిన్న మెదడు పనిచేయకపోవడాన్ని ప్రేరేపించడాన్న, జంతువులలో మరియు తరువాత మానవ శిశువులలో నిరూపించబడింది.
అవిసె గింజలలో లిగ్నాన్స్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ ఇతర మొక్కల ద్వారా లభించే ఇతర ఆహరం కంటే 800 రెట్లు ఎక్కువ పుష్కలంగా దొరుకుతాయి. ఈ లిగ్నాన్స్ ఆక్సిడేటివ్ డ్యామేజ్ (పర్యావరణ కాలుష్యం వలన కలిగే DNA దెబ్బతినడం మరియు వృద్ధాప్యానికి దారితీసే బలహీనమైన ఆహారాలు) నుండి రక్షణ కల్పిస్తాయి.
గుండె-రక్తనాళాల (కార్డియోవాస్కులర్) ఆరోగ్యం, పెద్దప్రేగు మరియు ప్రోస్టేట్ ఆరోగ్యం మరియు క్యాన్సర్ కణితులను తగ్గించడానికి ఉపయోగపడుతాయి.
రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో "అధిక స్థాయిలో మొక్కల నుండి లభించే లిగ్నన్ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది" అని ఒక అధ్యయనం పేర్కొంది.
ఒక అధ్యయనంలో టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారంలో 10 గ్రా ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని ఒక నెల పాటు తీసుకోవడం వల్ల ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయి 19.7% తగ్గినట్లు నిరూపించబడినది.
అవిసె గింజలలోని ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు జుట్టు, చర్మం మరియు గోరు పెరుగుదలను మెరుగుపరుస్తాయి.
క్లుప్తంగా అవిసె గింజల ప్రయోజనాలు:
1 . మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
2. బరువు తగ్గడంలో సహాయపడతాయి
3. కాన్సర్ ని నిరోధిస్తాయి
4. చర్మం, జుట్టు మరియు గోర్లను ఆరోగ్యవంతగా చేస్తాయి
5. రాత్రి మంచి నిద్రకు సహాయం చేస్తాయి
6. కాన్స్టిపేషన్ సమస్యకు చక్కని పరిష్కారం
7. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి
8. టైపు-2 మధుమేహ రోగుల్లో రక్తంలో చక్కర శాతాన్ని తగ్గిస్తాయి
9. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
10. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
వేయించినా లేక ముడివా?
సరిగా ముదరని (లేక పండని) మరియు ముడి(వేయించని లేదా ఉడకబెట్టని)అవిసె గింజలలో అధిక మోతాదులో హాని కలిగించే ఒక రకమైన విషా పదార్దాన్ని కలిగి ఉంటాయని చెబుతారు . ఆ విషాన్ని నాశనం చేయడానికి అవిసె గింజలను దోరగా వేయించు కొని తినడం మంచిదని అంటారు. ఎక్కువగా వేయించకూడదు , ఎక్కువగా వేయించడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. అవిసె గింజల్ని వేయించడం వల్ల వాటి రుచి కూడా పెరుగుతుందండోయ్.
రోజుకు ఎంత మోతాదు?
ఒక వ్యక్తి రోజుకు 15 నుంచి 30 గ్రాముల( ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్) వేయించిన అవిసె గింజల్ని లేదా వేయించిన అవిసె గింజల పొడిని తీసుకోవచ్చు.అంతకంటే మించి తీసుకొంటే కడుపులో ఇబ్బంది కలుగుతుంది.
ఏ సమయంలోనైనా తినవచ్చు?
రోజులో ఏ సమయంలోనైనా తినవచ్చు. అవిసె గింజలలో ఉండే అధిక ఫైబర్ కారణంగా భోజనానికి ముందు తినడం వల్ల మీ ఆకలి తగ్గుతుంది.
గమనిక : అవిసె గింజలను తింటున్న సమయంలో, పుష్కలంగా నీరు తాగాలి. అవిసె గింజల ఉపయోగించినప్పుడు తగినంతగా హైడ్రేట్ కాకపోతే, శరీరంలోని అదనపు ఫైబర్‌ను మన శరీరం సరిగా జీర్ణం చేసుకోదు. కడుపులో ఇబ్బంది మరియు మలబద్ధకానికి దారితీస్తుంది అని గుర్తుపెట్టుకొండి.
Category:
Telugu
Posted on:
April 26th, 2023