Telugu kings and Queens
అవును ఇతర దేశాలలో అటువంటి వారు ఉన్నారు. వారి పూర్వీకులు కచ్చితంగా తెలుగు వారు అనడానికి పలు ఆధారాలు కూడా ఉన్నాయి.
చామదేవి : ఈమె ఒకప్పుడు ఉత్తర థాయిలాండ్ ప్రాంతంలో సామంతరాణిగా వ్యవహరించింది. హరిపుంజాయి రాజ్యాన్ని స్థాపించింది. ఏడవ శతాబ్దంలో ఆ ప్రాంతాన్ని ఏలింది. ఈమె పూర్వీకులు తెలుగు వారు. అందుకే వంశపారంపర్యంగా ఆమెకు చామదేవి అనే పేరు పెట్టారు. ఆమె తెలుగు వారి చీరకట్టుతో అలంకరణ చేసుకొనేది. ఎన్నెన్నో యుద్ధవిద్యలను నేర్చుకుంది. థాయిలాండ్‌లో బౌద్ధ మతవ్యాప్తికి చామదేవి ఎంతగానో కృషి చేసింది. ఆమె తన రాజ్యంలోని పింగ్, వాంగ్ నదుల మధ్యనున్న ప్రాంతాన్ని "సమ ఆంధ్ర" అనే పేరుతో పిలిచేవారు. 7 వ శతాబ్దంలో చామదేవి తన పరిపాలనను సాగించారు.
ఈమె రాజ్యపాలనలో ఆంధ్ర, కళింగ ప్రాంతాల నుండి ఎందరో తెలుగు వారు వచ్చి, థాయిలాండ్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారట. చామదేవి తన ప్రజలను బిడ్డల మాదిరిగా చూసేవారు. అందుకే ఆమె చనిపోయినా కూడా, ఆమెకు గుడి కట్టి అక్కడి తెలుగు సంతతికి చెందిన థాయ్ వాసులు పూజలు చేస్తున్నారు. చామదేవి తరువాతి వంశంలోని బిడ్డలకు నూకరాజు, దాసరాజు అనే పేర్లతో నామకరణం చేశారు. ఆమె సమాధిని కూడా బౌద్ధ స్తూపం ఆకారంలో నిర్మించారు.
చిత్రం : చామదేవి (థాయిలాండ్ టూరిజం వెబ్ సైట్)
తగవున్ మగాడు వరేరు - ఈయన బర్మాలోని ఓ రాజు. మర్తబాన్ రాజ్య వంశస్తుడు. ఈయన పూర్వీకులు తెలుగువారు. రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోకముందు వీరు తెగలుగా జీవించేవారు. కానీ మగాడు, బర్మా రాకుమారి మీనాంగ్‌తో ప్రేమలో పడ్డాక, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తను కూడా యుద్ధాలు చేయాల్సి వచ్చింది. తగవున్ మగాడి పూర్వీకులు తమను మన్ జాతి వారిగా పేర్కొన్నారు. సర్ ఆర్థర్ ఫెయిరీ అనే శాస్త్రవేత్త తన పరిశోధనలలో భాగంగా మన్ జాతీయులను తొలుత బర్మాలో తలైంగులు అనేవారని తెలిపారు.
తలైంగులు అంటే తెలుగు నేల నుండి వచ్చినవారు అని అర్థమట. అలా తలైంగులుగా పిలవబడి తెగ నుండి తొలిసారిగా ఒక తెలుగు సంతతి వ్యక్తి బర్మాలో రాజయ్యాడు అంటే, ఆయన తగవున్ మగాడు ఒక్కడే. తన రాజ్యానికి రామన్య రాజ్యంగా ఆయన పేరు పెట్టుకున్నాడు. తన పేరును వరేరుగా మార్చుకున్న తగవున్ మగాడు, తన రాజ్యానికి మను చరిత్ర ప్రేరణతో ఓ ధర్మ శాస్త్రాన్ని కూడా రూపొందించాడట. 11వ శతాబ్దంతో తెలుగు సంతతి రాజుగా బర్మాలో సత్తా చాటిన వారు తగవున్ మగాడు. ఇతని తర్వాత తరం రాజు పేరు రాజాధిరతుడు. ఇతడు మగాడికి మేనల్లుడు. ఆ తర్వాత ఈయన వారసులు ఎందరో రాజులయ్యారు.
కన్నస్వామి నాయకుడు - ఈయనకే విక్రమ రాజసింహుడనే పేరు ఉంది. శ్రీలంకలో ఆయన రాజ్యం స్థాపించుకున్నారు. 16 వ శతాబ్దంలో జన్మించారు. తెలుగు నేల నుండి శ్రీలంక వెళ్లిన వీర శైవులే కన్నస్వామి వంశస్తులు. తర్వాత వీరు బౌద్ధ మతం వైపు మొగ్గుచూపారు. తర్వాత బ్రిటీషర్లు కన్నస్వామిని లొంగతీసుకున్నారు. ఆయన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని భరణం ఇచ్చేవారు. అయితే కన్నస్వామి పూర్వీకులైన తెలుగు సంతతి రాజులు, శ్రీలంకలో 16 వ శతాబ్దం నుండే తమ ప్రాభవాన్ని చూపించారు.అంతకుముందు దిజనర అనే మరో తెగ రాజులు పాలించేవారు. కన్నమస్వామి నాయకుడి ముత్తాత తాత అయిన మధురై నాయకుడు విజయరాజ సింహుడే కందై రాజ్యానికి శంకుస్థాపన చేశాడు.
చిత్రం : కన్నస్వామి నాయకుడిని బంధించిన బ్రిటీషర్లు (వికీపీడియా)
Category:
Telugu
Posted on:
May 15th, 2023