మూఢాచారాలు ఎలా పుడతాయో వ్యంగ్యంగా చెప్పే చక్కటి సామెత

Posted on May 24th, 2023
Share this post:

మూఢాచారాలు ఎలా పుడతాయో వ్యంగ్యంగా చెప్పే చక్కటి సామెత

ఒక బ్రాహ్మణుడు. యింట్లో పిల్లిని పెంచేవాడు. అదంటే ప్రాణం. బ్రాహ్మడివి, యీ పిల్లి పెంపకం ఏమిటయ్యా అన్నా కూడా నవ్వి వూరుకునేవాడు. ఆ పిల్లిని సాకటం మానలేదు. ఆ బ్రాహ్మణుడు తన తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు మాత్రం ఆ పిల్లిని వొక గుంజకి కట్టేసేవాడు. ఆ పిల్లి తద్దినం వంటలో మూతి పెట్టి మడి చెడగొడుతుందని భయం. యీ తంతుని ఆ బ్రాహ్మణుడి కొడుకు చిన్నతనం నుండీ గమనిస్తూ వున్నాడు.

ఆ బ్రాహ్మణుడి తరం అయిపోయింది. చనిపోయాడు. కొడుకు పెత్తనం వచ్చింది. యీ కొడుక్కి పిల్లి అంటే పరమ అసహ్యం. అయినా, తన తండ్రికి తద్దినం పెట్టేటప్పుడు ఒక పిల్లిని వెతుక్కొచ్చి మరీ గుంజకి కట్టి, తండ్రికి తద్దినం పెట్టేవాడు.

అదేమిట్రా అంటే, మా యింటి ఆచారం అంతే. మా నాన్న ఇలానే చేసేవాడు అని మూర్ఖంగా సమాధానం చెప్పేవాడు.

మూఢాచారాలు ఎలా పుడతాయో వ్యంగ్యంగా చెప్పే చక్కటి సామెత యిది.

Category:
Telugu

Posted on:
May 24th, 2023