సెన్సిటివ్ మైండ్ వున్నవారు దృఢంగా ఎలా మారాలి?

Posted on June 20th, 2023
Share this post:

సెన్సిటివ్ మైండ్ వున్నవారు దృఢంగా ఎలా మారాలి?

Note : ప్రశ్నను 'సత్య' అడిగారు. వేదిక లోకి తీసుకు రావడం జరిగింది.

గోదావరి తీరం వెంబడి ఉన్న ఇసుక మధ్యలో అనేక రాళ్లు కనిపించేవి, అవి చాలా చిన్నగా ఉంటాయి.

ఈ రాళ్లు ఎలా వస్తున్నాయి, అని నేను పరిశీలించినప్పుడు నాకు అర్థమైంది ఏమిటి అంటే, ముందుగా అక్కడికి కొంత మట్టి చేరి , ఆ మట్టి ఎండిపోయిన తర్వాత రాళ్లుగా మారుతున్నాయి.

ఆ మట్టి లాగానే మనలో కూడా అనేక ఆలోచనలు వస్తున్నాయి.

ఆలోచనలు కొన్నాళ్ళు స్థిరంగా ఉండిపోయిన తర్వాత అవి మనలో రాయివలె స్థిరంగా మారిపోతున్నాయి.

ఇప్పుడు నేను అనే భావన కూడా ఈ ఆలోచనలు అనే రాళ్లతో నిర్మించబడింది.

నేను నుంచి పుడుతున్న మాటలు మన రోజువారీ జీవితంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.

ఇప్పుడు ప్రశ్న సున్నితంగా ఉన్న మనుషులు దృఢంగా ఎలా మారాలి ?.

ఏవో కొన్ని వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదివి లేదా ఎవరి మాటలైనా విని మనము దృఢమైన వ్యక్తిగా తయారయ్యాం అనుకుందాం.

అప్పుడు ఆ దృఢమైన వ్యక్తిత్వం నుంచి కూడా కొన్ని సమస్యలు వస్తాయి.

అసలు సమస్య ఈ నేను కాబట్టి మనం సునీతత్వం నుంచి దృఢంగా మారిన, ఈ దృఢమైన మనిషి నుంచి ఇంకోలా మారిన మనము చివరగా ఏదో ఒక తప్పుడు ఐడెంటిఫికేషన్ తో ఉండిపోతున్నాము.

మరి దీని నుండి బయటపడడం ఎలా ?.

నేను నీ మించింది ఏదైనా ఉండాలి, అది మనం పోగు చేసుకున్నది అయి ఉండకూడదు.

స్పేస్ (ఖాళీ ).

మీరు ఎప్పుడైనా వ్యాయామం, మెడిటేషన్, యోగ చేసిన తర్వాత ఇది గమనించారా ?

ఒక రకమైన తేలికతనం అనిపిస్తుంది, శరీరం అంత గాలిలో లో తేలినట్టు, మనసు కూడా ఆనందంగా ఉంటుంది.

ఈ తేలికతనం అనేది మీ చుట్టూ నిర్మించబడిన స్పేస్ వల్ల వస్తుంది.

ఈ స్పేస్ అనేది ఎంత పెద్దగా అవుతుంది అంటే , మీలో ఉన్న నేను అనేది చాలా చిన్నగా మారిపోతుంది, మీ ఆలోచనలో ఉన్న లోపాలన్నీ మీకు తెలిసిపోతాయి.

మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గమనించారా ? మీలో ఉన్న నేను పూర్తిగా తగ్గిపోయి అక్కడ ఉన్న స్పేస్ లో ప్రశాంతతను మీరు అనుభవిస్తారు.

ఎప్పుడు ఎరుకలో ఉండడం ద్వారా , మీ స్వీయ లోపాలను అధిగమించడమే కాకుండా మనసు సృష్టిస్తున్న మాయ నుంచి బయటపడవచ్చు.

ఎప్పుడు కూడా సమస్యను డైరెక్టుగా చూడొద్దు

ఇంతకు ముందు జంతువులను ఎదుర్కొనే క్రమంలో ఎప్పుడూ కూడా మనిషి వాటిని కళ్ళలో కళ్ళు పెట్టి చూడొద్దు అని రాశాను.

ఇదే ఫార్ములా మీ ముందు ప్రత్యక్షమైన ఏదైనా సమస్యకు వర్తిస్తుంది.

ఉదాహరణకు.

ఒక వ్యక్తి మీ ముందు నిలబడి మిమ్మల్ని నిందిస్తూ మాట్లాడుతున్నాడు.

ఎదుటి వాళ్ళ మాటల్ని పూర్తిగా దృష్టి సారించి విన్నట్టు అయితే అవి మీ మీద చూపించే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.

మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలిస్తూ మీరు ఆ మాటల్ని విన్నట్లయితే అవి మీ మీద పెద్దగా ప్రభావం చూపించవు.

మీరు ఎప్పుడైతే వాళ్ళ మాటలు పట్టించుకోరో, ఆ మాటలు అన్నవారికి చాలా కోపం వస్తుంది.

దీన్ని ఇంకోవిదంగా చెప్పాలంటే.

మీ ముందు ఒక యాక్సిడెంట్ అయ్యింది అప్పుడు మీ రియాక్షన్ ఒకలాగా ఉంటుంది.

మీకు కిలోమీటర్ల దూరంలో ఒక యాక్సిడెంట్ అయ్యింది ఇప్పుడు అది మీ పైన చూపించే ప్రభావం చాలా తక్కువ.

ఇది కేవలం ఎరుకలో ఉండడం వల్ల మీ చుట్టూ స్పేస్ ఉండడం వల్ల జరిగే మార్పు.

పైన చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశాలు.

  1. నేను అనే లోపటి ఆలోచన అన్నింటికీ మూలం.
  2. ఎరుకలో ఉండడం ద్వారా నేను పై అధిపత్యాన్ని చలాయించవచ్చు.
  3. వ్యాయామము ధ్యానము యోగా ద్వారా మన చుట్టూ స్పేస్ క్రియేట్ చేయవచ్చు.
  4. శరీరం మొత్తం తేలికగా అనిపిస్తుంటే, మీ చుట్టూ స్పేస్ క్రియేట్ అవుతుందని అర్థం
  5. ఎరుకలో ఉండడం ద్వారా స్పేస్ ఎక్కువగా పెరుగుతుంది.
  6. సమస్యను మరియు సమస్యలను సృష్టించే వారు మన కళ్ళు ఎదురుగా ఉన్న గాని వాటిని ఎప్పుడూ డైరెక్టుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడవద్దు.
  7. సమస్యను ఎరుకలోకి తీసుకురావడం ద్వారా సమస్య యొక్క ప్రభావం తగ్గిపోతుంది.
  8. స్పేస్ లో నేను అనే ఐడెంటిఫికేషన్ పూర్తిగా కోల్పోతారు..

Category:
Telugu

Posted on:
June 20th, 2023